రైల్వే స్టేషన్‌లో పేలుడు. ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలు

Chhattisgarh: Blast Hits CRPF Sspecial Train at Raipur Railway Station - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ ట్రైన్‌లో ఇగ్నిటర్‌సెట్‌ ఉన్న బాక్స్‌ కిందపడి పేలిపోయిన ఘటనలో ఆరుగురు సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) సిబ్బంది తీవ్రంగా గాయడ్డారు. గాయపడిన జవాన్లను రాయ్‌పూర్‌లోని నారాయణ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఉదయం 6.30 సమయంలో జార్సుగూడ నుంచి జమ్మూతావి వెళ్తున్న రైలు ప్లాట్‌ఫామ్‌ మీద ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top