ప్రిన్సిపల్‌ పోస్ట్‌ కోసం పిడిగుద్దులు.. ముష్టిఘాతాలు

This Brawl Is Over A School Principals Post In Bihar - Sakshi

పాట్నా:  ఏ జాబ్‌లోనైనా ప్రమోషన్‌ రావాలంటే  అందుకు తగ్గ అర్హత ఉండాలి. మరి ఇద్దరికి అర్హత ఉండి ఒక్కడ్నే ఆ పోస్ట్‌లో కూర్చోబెట్టాలంటే అది కత్తి మీద సామే. ఇక్కడ ఎవరు బెస్ట్‌ అని ఆప్షన్‌ మాత్రమే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసే ఆ పదవిలో ఒకర్ని కూర్చోబెడతారు. మరి పిడిగుద్దులు కురిపించుకుంటే అనుకున్న పదవి కట్టబెడతారానుకున్నారో.. ఏమో.. తలపడిపోయారు.. కిందా పడిపోయారు.. స్కూల్‌ ప్రిన్సిపల్‌ పోస్ట్‌ కోసం తన్నుకుని రచ్చ చేసుకున్న ఘటన బిహార్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.,.  పాట్నాకు 150 కి.మీ దూరంలో ఉన్న మోతిహరిలోని స్టేట్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో  శివశంకర్‌ గౌరి-రింకీ కుమారీలు ఇద్దరూ స్కూల్‌ ప్రిన్సిపల్‌ పోస్ట్‌ కోసం పోటీ పడ్డారు. దీనిలో భాగంగా ఉద్యోగానికి ఎవరు ఎక్కువ సీనియర్, తగిన అర్హత ఉన్నారనే విషయంపై అర్హతల పత్రాలను అందజేయాలని జిల్లా విద్యా శాఖ ఆదేశించింది.   ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. 

ఇక్కడ రింకీ కుమార్‌ భర్త కూడా ఎంటర్‌ అయిపోయాడు. ఇది మరింత కాక రాజేసింది. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో పత్రాలను సమర్పించే క్రమంలో శివ శంకర్‌తో తీవ్రంగా ఘర్షణ పడ్డాడె రింకీ కుమారీ భర్త.. ఈ గొడవలో శివ శంకర్‌ గౌరీని రింకీ కుమార్‌ భర్త కిందపడేశాడు. శివ శంకర్‌ను ఎటు కదలనీయకుండా చేసిన రింకీ భర్త.. చివరకు కింద పడేవరకు  వదల్లేదు. అక్కడున్న వారు వారిద్దర్నీ విడదీయడానికి ఎంతగా యత్నించినా వారు మాత్రం రెచ్చిపోయి మరీ ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. 

, ,
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top