‘డ్యూటీలో ఉన్నా లేకున్నా మందు ముట్టం, ఆన’ బిహార్ డీజీపీ ప్రతిజ్ఞ

Bihar Dgp Administers New Oath State Cops On Liquor - Sakshi

పట్నా: మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు బిహార్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ సందీప్‌ కుమార్‌ సింఘాల్.. తన సహొద్యోలతో కలిసి.. మద్యాన్ని జీవితంలో ముట్టబోనని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. పాట్నాలోని పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.

నిబంధనలను ఉల్లంఘించే పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని డీజపీ స్పష్టం చేశారు. ఆయన ప్రమాణం చేస్తూ.. ‘సందీప్ కుమార్ సింఘల్ అనే నేను.. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని, జీవితంలో దానిని ఎప్పుడూ ముట్టనని ఈరోజు (నవంబర్ 26) ప్రమాణం చేస్తున్నాను. విధుల్లో ఉన్నా, లేకపోయినా.. నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. రోజువారీ జీవితంలో లిక్కర్ కు తావివ్వను. మద్యపాన నిషేధ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తాను‘ అని డీజీపీ ప్రమాణం చేశారు.

ప్రమాణం చేసిన సీఎం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఇదే విషయమై ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలోని ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన శుక్రవారం ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. ’మద్యంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాము. మద్యపాన నిషేధాన్ని అధికారులు కఠినంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’ అని పిలుపునిచ్చారు.

గత కొంతకాలంగా.. రాష్ట్రంలోని వివిధ హోటళ్లు, వెడ్డింగ్ హాల్స్ లో పోలీసులు రైడ్లు చేసి.. మద్యం సేవిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ప్రజలను హింసిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అయితే నితీశ్ కుమార్ ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిషేధిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే కఠిన నిర్ణయాలకు పూనుకున్నారు.

చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. బుక్‌ చేసుకోవద్దంటూ జనాలకు కేంద్రం సూచన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top