Chettur Sankaran Nair Biography: మహోజ్వల భారతి

లాయర్ నాయర్
చెట్టూరు శంకరన్ నాయర్ ప్రసిద్ధ న్యాయవాది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పని చేసిన స్వాతంత్య్రోద్యమ కార్యకర్త. నేడు నాయర్ జయంతి. ఆయన 1857 జులై 11 న పాలక్కాడ్ జిల్లా, మంకర గ్రామంలో హిందూ కులీన కుటుంబంలో జన్మించారు. 1919 లో భారత రాజ్యాంగ సంస్కరణలపై సభ్యుడుగా భారతదేశ బ్రిటిష్ పాలన లోని వివిధ లోపాలను ఎత్తిచూపుతూ సంస్కరణలను సూచించారు. ఒక భారతీయుడు అలాంటి విమర్శలు చేయడం, అలాంటి డిమాండ్లు చేయడం ఆ రోజుల్లో నమ్మశక్యం కాని సంగతే. ఇంకా నమ్మలేని సంగతి.. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సిఫార్సులను చాలావరకు ఆమోదించడం! 1919 ఏప్రిల్ 13న జలియ¯Œ వాలాబాగ్ మారణకాండ తరువాత నాయర్ వైస్రాయ్ కౌన్సిల్‌కు రాజీనామా చేశారు. 77 ఏళ్ల వయసులో 1934 ఏప్రిల్ 24 న మరణించారు.
విభజన తరిమేసింది!
హిందీ సినిమా తొలి మహిళా కమెడియన్ ఉమాదేవి ఖత్రి జయంతి నేడు. నాటి యునైటెడ్ ప్రావిన్సులోని ఉత్తరప్రదేశ్‌లో 1923 జూలై 11న జన్మించిన ఉమాదేవి ఖత్రి.. ‘టున్ టున్’ అనే స్క్రీన్ నేమ్‌తో సుప్రసిద్ధులు. మొదట ఆమె నేపథ్యగాయని. తర్వాతే నటి, కమెడియన్. ఒక భూమి తగాదాలో ఆమె తల్లిదండ్రులు, సోదరుడు.. ఆమెకు రెండున్నరేళ్ల వయసులోనే చనిపోయారు. ఆమె బాల్యమంతా పేదరికంలో గడిచింది. ఎక్సైజ్ డ్యూటీ ఇన్‌స్పెక్టర్ అఖ్తర్ అబ్బాస్ ఖాజీ ఆమెకు సహాయం చేసి, ఆమెకు స్ఫూర్తినిచ్చారు. దేశ విభజన సమయంలోని దారుణమైన పరిణామాలతో వికల మనస్కురాలైన ఉమాదేవి బాంబే వెళ్లిపోయి, గాయనిగా కెరీర్‌ను ప్రారంభించారు.
స్వతంత్ర లహరి
జంపా లహరి స్వతంత్ర భావాలు గల రచయిత్రి. ‘ప్రెసిడెంట్స్ కమిటీ ఆన్ ద ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్’లో సభ్యురాలిగా ఆమెను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. అయితే ట్రంప్ వచ్చాక ఆమె ఆ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘‘మీ ద్వేషపూరిత వాక్చాతుర్యం గల పదాలు, చర్యల నుండి దూరంగా ఉండేందుకు గాను నేను రాజీనామా చేస్తున్నాను’’ అనే సూచనను డొనాల్డ్ ట్రంప్‌కి అందించి మరీ ఆమె తన సభ్యత్వం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె ‘ప్రి¯Œ ్సటన్ విశ్వవిద్యాలయంలో సృజనాత్మ రచనల విభాగం ప్రొఫెసర్‌గా ఉన్నారు. నేడు జంపా లహరి జన్మదినం. పశ్చిమ బెంగాల్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబంలోని ఈ అమ్మాయి 1967 జూలై 11న లండన్‌లో జన్మించారు.
మరిన్ని వార్తలు