నాగోమ్ (అస్సాం): అస్సాంలో త్వరలో లవ్‌జిహాద్, బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాలు తెస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారు.
అస్సాంకే ప్రత్యేకతను తెచ్చిపెట్టిన శాస్త్రాల (వైష్ణవ సాంస్కృతిక కేంద్రాలు) పరిరక్షణతోపాటు టీ తోటల్లో పనిచేసే ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించే చట్టాలు కూడా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను రూపొందించి, కేబినెట్ ఆమోదించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాకు తెలిపారు.


