
లక్నో: లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా విచారణకు హాజరయ్యాడు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం యూపీ పోలీసులు విచారణకు హాజరవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఘటన జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఆయన శనివారం ఉదయం యూపీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 3న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటికే అశిష్ మిశ్రాపై హత్య కేసు కూడా నమోదైంది. చదవండి: (నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?)