విజయ్‌కు షాక్‌ | Another DMK Alliance Party Refuse to Support Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌కు షాక్‌

May 6 2026 8:41 AM | Updated on May 6 2026 8:59 AM

Another DMK Alliance Party Refuse to Support Vijay

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న విజయ్‌కు షాక్‌ తగిలింది. టీవీకేకు ఎట్టిపరిస్థితుల్లో తాము మద్దతు ఇవ్వబోమంటూ ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (IUML) ప్రకటించింది. డీఎంకే నాయకత్వం తీసుకునే నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటాం అని ఆ పార్టీ అధినేత ఖాదర్‌ మొహిదీన్‌ బుధవారం ప్రకటించారు.

డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌(SPA) తరఫున.. రెండు స్థానాల్లో పోటీ చేసింది. చేసిన రెండు చోట్ల విజయంతో 100 పర్సంట్‌ స్ట్రయిక్‌ రేట్‌ సాధించింది. పాపనాశంలో A. M. షాజహాన్, వాణియంబాడిలో సయ్యద్‌ ఫారూఖ్‌ బాషాలు విజయం సాధించారు. మరోవైపు.. డీఎంకే కూటమిలోనే ఉన్న విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) కూడా విజయ్‌ పార్టీకి పొత్తు ఇవ్వమని స్పష్టం చేసింది.

తమిళనాడులో విజయ్‌ టీవీకే 108 సీట్లు గెలుపొందింది. అధికారం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది మద్దతు అవసరం. అంటే.. సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్నమాట. కాంగ్రెస్‌(5) మద్దతు దాదాపు ఖరారు కాగా.. లెఫ్ట్‌ పార్టీలు(4) కూడా జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరో స్థానం తక్కువ పడుతుండడంతో ఎవరు మద్దతుకు ముందుకు వస్తారా? అనే కుతూహలం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement