ఎయిరిండియా పైలెట్ల నిర్వాకం: డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వైనం 

Air India Pilots Let Plane Midway As Duty Hours Over - Sakshi

మరోసారి వార్తల్లో నిలిచిన ఎయిరిండియా

డ్యూటీ టైమ్ అయిపోయిందని వెళ్ళిపోయిన పైలెట్లు

జైపూర్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల అవస్థలు 

జైపూర్: లండన్ నుండి ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ పైలెట్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందన్న కారణంతో ప్రయాణం మధ్యలోనే ప్రయాణికులను విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. 

లండన్ నుండి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని జైపూర్లో ల్యాండ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి విమానానికి క్లియరెన్స్ లభించినప్పటికీ ఎయిరిండియా పైలెట్లు తమ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సుమారు 350 మంది ప్రయాణికులను చాలాసేపు నిరీక్షణ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి తరలించారు. 

పైలెట్ల చర్యపైనా, ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా చిర్రెత్తిపోయిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు విజ్ఞప్తి చేస్తూ.. జైపూర్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి ఇంతవరకు   ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తమను ఎదో ఒక విధంగా గమ్యస్థానాలకు  చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top