అందరికీ స్ఫూర్తి బాబు జగ్జీవన్‌రామ్‌ | - | Sakshi
Sakshi News home page

అందరికీ స్ఫూర్తి బాబు జగ్జీవన్‌రామ్‌

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

నారాయణపేట: దేశ మాజీ ఉప ప్రధాని, సమతా వాది బాబు జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూ ర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్‌ ప్రతీ క్‌ జైన్‌ కోరారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రజా వాణి సమావేశ మందిరంలో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో అర్ధ శతాబ్ధానికి అగ్రశ్రేణి నేత గా శాసన సభ్యత్వంతో మొదలు దేశ ఉప ప్రధా ని వరకు ఎన్నో పదవులు నిర్వర్తించాలని గుర్తుచేశారు. మొద టి న్యాయ, కార్మికశాఖ మంత్రిగా పనిచేసి చేసిన సంస్కరణలు అనిర్వచనీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యతోనే తనకు కలెక్టర్‌గా గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని.. అనుకుంటే ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధనకు నిరంతరం కృషి చేయా లని సూచించారు. తాను కొత్తగా వచ్చానని.. జిల్లాలోని అన్ని వసతి గృహాలను సందర్శిస్తానని చెప్పారు. వసతిగృహాల్లో ప్ర తి వారం విద్యార్థులకు సందేశాత్మక సినిమాలను చూపించాలని, మూవీ క్లబ్‌ను అమలు చేయాలన్నారు. అనంతరం వసతిగృహ విద్యార్థినులతో జగ్జీవన్‌రామ్‌ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పించారు. అభినందించి రాత పుస్తకాలు, పెన్ను లు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివారెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ శ్రీధర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అబ్దుల్‌ ఖలీల్‌, డీపీఆర్వో రషీద్‌, కౌన్సిలర్లు మహేష్‌, రాజేష్‌, భరత్‌, ఏఎస్‌డబ్ల్యూఓ పరమేశ్‌, సింగిల్‌విండో డైరెక్టర్‌ సంక్లాపురం మల్లేష్‌, దళిత సంఘాల నాయకులు మొచ్చ శరణప్ప, సూర్యకాంత్‌, పరిగి రమేష్‌ ఈశ్వరమ్మ, మహదేవ్‌, ఎస్సీ వసతిగృహాల వార్డెన్లు, ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement