కృష్ణా: కృష్ణా జలాలను పంటల సాగుకు సంపూర్ణంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం రాయిచూర్‌లో కర్ణాటక మైనర్ ఇరిగేషన్‌శాఖ మంత్రి బోసురాజుతో పాటు ఆ శాఖ అధికారులతో మంత్రి చర్చలు జరిపారు. ప్రధానంగా కృష్ణానదిపై కొల్పూర్ గ్రామం వద్ద నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి బ్యారేజీ, అదేవిధంగా కుసుమర్తి సమీపంలో బ్రిడ్జి కం బ్యారేజీ విషయమై వారితో ప్రాథమిక చర్చలు జరిపినట్లు వివరించారు. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీరేందుకు అవకాశం ఉంటుందని, ఇందుకుగాను తమ ప్రభు త్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా సహకరిస్తుందని అధికారులు వివరించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆనంద్‌గౌడ్, శివరాంరెడ్డి, నాగేందర్, శంకర్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.


