కోస్గి రూరల్: విద్యతోనే నై పుణ్యాలను ప్రదర్శించవ చ్చని శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలో ని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ హబ్‌ను పరిశీలించారు. గ్రా మీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని.. వారిలో దాగి ఉన్న నైపుణ్యాలు, మెళకువలను వెలికితీసేందుకు అవసరమవుతుందన్నారు. పెండింగ్ సామగ్రిని సంబంధిత కాంట్రాక్టర్ అప్పగించాకే బిల్లులు మంజూరు చేయాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో ఏజెన్సీని మార్చాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయు ల వివరణ ఆధారంగా నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జిల్లా విద్యా ధికారి గోవిందరాజు తెలిపారు. కార్యక్రమంలో యాదయ్యశెట్టి, మండల విద్యాధికారి శంకర్‌నాయక్ పాల్గొన్నారు.


