అనర్హులకే పెద్దపీట!
కోస్గి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి నిజమైన లబ్ధిదారులకే ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ఇళ్ల మంజూరులో గాని, లబ్ధిదారుల ఎంపికలో గాని, బిల్లుల చెల్లింపులోగాని ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నప్పటికి కొందరు అధికారులు, నాయకులతో కుమ్మక్కవడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు చోటిస్తూ ప్రభుత్వ పారదర్శకతకు పాతర వేస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. ప్రజాపాలనలో స్థానిక అధికార యంత్రాంగం ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సమగ్ర పరిశీలన అనంతరం గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిపొందిన వారిని ఎల్–3లో నమోదు చేసి అర్హులైన వారిని ఎల్–1, ఎల్–2 లుగా విభజించి జిల్లా ఉన్నత అధికారులు జాబితాను స్థానిక అధికారులకు అందజేశారు. మరోమారు హౌజింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజమైన లబ్ధిదారుల జాబితాను మరోమారు క్రోడికరించి తుది జాబితాను తయారు చేశారు. అధికారులు ఇందిరమ్మ కమిటీలకు ఎంపిక బాధ్యత ఇవ్వడంతో కొందరు నాయకులు ఇష్టరీతిగా వ్యవహారించడంతోపాటు అధికారులతో కుమ్మకై ్క అక్రమాలకు తెర తీశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతకు పాతర
పర్సంటేజీ ఇచ్చే వారికి ఇళ్ల మంజూరు
అర్హులకు తప్పని నిరాశ
మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు


