
యూరియా కోసం రాస్తారోకో
ధన్వాడ: యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం 6 గంటలకే రైతులు రాస్తారోకో చేశారు. ధన్వాడలోని నారాయణపేట – హైద్రాబాద్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ధన్వాడ ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం అధికారులు మూడు రోజులకు సరిపడా టోకెన్లు అందజేయగా.. రెండు రోజులుగా యూరియా సంచులు రాలేదని పంపిణీ చేయడం లేదు. దీంతో నిత్యం యూరియా కోసం కార్యాలయానికి తిరుగుతున్నా యూరియా అందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇచ్చే రెండు సంచులు కూడా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని యూరియా వచ్చిన తరువాత సమాచారం అందజేస్తామని రైతులకు నచ్చజెప్పి పంపించి వేశారు.
యూరియా కోసం ఎగబడిన రైతులు
కొత్తపల్లి: మండల కేంద్రంలోని హాకా సెంటర్‌కు యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు ఎగబడ్డారు. బుధవారం హాకా సెంటర్‌కు 300 బస్తాల యూరియా లారీ రావడం.. విషయం సమీప గ్రామాల రైతులకు కూడా సమాచారం చేరడంతో ఒక్కసారిగా కొత్తపల్లి గ్రామానికి రైతులు చేరుకున్నారు. ఆధార్, పట్టదార్ పాసుపుస్తకాలు భారీగా చేరుకున్నారు. అయితే, గంటలోపే యూరియా బస్తాలు అయిపోయాయి. ఆలస్యంగా వచ్చిన రైతులు యూరియా దొరకలేదు. ఒక్కో వ్యక్తికి రెండు బస్తాల యూరియాను సరఫరా చేశారు.

యూరియా కోసం రాస్తారోకో