
918 టీఎంసీలు
లక్ష్యానికి చేరిన విద్యుదుత్పత్తి
సాగునీటి పథకాలకు 17.2 టీఎంసీలు
వంద రోజుల్లో
న్యూస్‌రీల్
మతసామరస్యాన్ని చాటాలి : ఎస్పీ
నారాయణపేట క్రైం: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో చేపట్టే ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకొని మతసామరస్యాన్ని చాటాల ని కోరారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, అనుచిత పోస్టులు పెడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
కృష్ణా బ్రిడ్జిపై
స్తంభించిన ట్రాఫిక్
కృష్ణా: మండలంలోని కృష్ణా బ్రిడ్జిపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శక్తినగర్, రాయచూర్ పట్టణాల నుంచి గణేశ్ విగ్రహాలను ఒక్కసారిగా కృష్ణా బ్రిడ్జిపైకి అధిక సంఖ్యలో తీసుకురావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇటు టైరోడ్డు వరకు, అటు శక్తినగర్ వరకు దాదాపు 5 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి 3గంటల సమయం పట్టింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కర్ణాటక పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి కావని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేశారు.
యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం
మద్దూరు: రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్‌రాంరెడ్డి విమర్శించారు. ఆదివారం మద్దూరులో సీపీఎం ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన వరిపంటకు అవసరమైన యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం మద్దూరు ఏరియా కార్యదర్శిగా గోపాల్‌ను ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు అశోక్, అంజిలయ్య, అలీ, జోషి, శివకుమార్, హన్మంతు, రామకృష్ణ, లాలప్ప, అరుణ్, వెంకట్ ఉన్నారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 920 క్యూసెక్కుల వరద జ లాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వ లో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జ లాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875, కుడి, ఎడమ కాల్వలకు 55, ఎత్తిపోతల పథకాలకు 873, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
కోయిల్‌సాగర్‌లో 32.3
అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 32.3 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా, మరో 0.3 అడుగుల మేర నీరు చేరితే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టు గేట్లను గతవారం నుంచి మూసివేశారు. ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉండడంతో సందర్శకుల సందడి కనిపించింది. జిల్లాకేంద్రం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గద్వాల: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది.
● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్‌కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్‌లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్‌లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు.
జూరాలకు భారీ వరద రావడంతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో చేపపిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్ల కమిటీ చైర్మన్‌గా అడిషనల్ కలెక్టర్, మెంబర్ కం కన్వీనర్‌గా జిల్లా మత్య్సశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో చేపపిల్లల టెండర్లు, మత్య్సకారులకు పంపిణీ, చెరువుల్లో వదిలేంత వరకు వారి పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుంది.
న్యాయమైన పరిహారం కోసమే ఆందోళన
నారాయణపేట: తాము పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకం కాదని.. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని భూ నిర్వాసితుల సంఘం సలహాదారులు బండమీది బలరాం, కృష్ణ మడివాల్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 55వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలసలు, కరువుకు నెలవుగా మారిన నారాయణపేట ప్రాంతానికి తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు అవసరమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూ నిర్వాసితులు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని.. న్యాయమైన పరిహారం కోసమే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు రూ. 35లక్షలు ఇవ్వాలని కోరారు. రీలే దీక్షలు చేపట్టిన వారిలో అంజప్ప, నర్సింహులు, కాశప్ప, శివ, గోవర్ధన్, సుదర్శన్, భాస్కర్ ఉన్నారు.
జాతీయస్థాయి శిక్షణకు జిల్లా ఉపాధ్యాయుడు
నారాయణపేట రూరల్: కృష్ణా మండలం కున్సీ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న కుందేటి నర్సింహ జాతీయస్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. సీసీఆర్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే శిక్షణకు ఆయన హాజరు కానున్నారు. జూన్‌లో రాష్ట్రస్థాయిలో జరిగిన శిక్షణ శిబిరానికి ఆయన హాజరై ప్రతిభ చాటడంతో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం–2020 అంశంపై 15 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది. కాగా, హెచ్‌ఎం కుందేటి నర్సింహ ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ మేరకు నర్సింహను డీఈఓ గోవిందరాజులు, ఎంఈఓ నిజాముద్దీన్ అభినందించారు.
ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యాన్ని అధికారులు చేరుకున్నారు. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి సెప్టెంబర్ మొదటి వారంలోనే లక్ష్యానికి చేరుకొని రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకు విద్యుదుత్పత్తి ప్రారంభించగా.. ఆదివారం 613 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించారు. కాగా ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 610 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో వరద జలాశయానికి చేరడంతో ముందస్తు విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
● జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా రెండేళ్లుగా చైనా నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో సమస్య పరిష్కారమై వినియోగంలోకి రావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. ఈ యూనిట్ ముందు నుంచి వినియోగంలో ఉంటే ఆగస్టులోనే లక్ష్యాన్ని చేరుకునే వారమని అధికారులు చెబుతున్నారు.
● దిగువ జూరాలలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కొక్క యూనిట్‌లో 40 మెగావాట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. 24 గంటల పాటు 40 మెగావాట్ల ఉత్పత్తి చేపడితే 9,600 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 100 ఓల్టేజీ గల పది బల్బులు ఒక గంటసేపు వాడితే ఒక్క యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది. 10 లక్షల యూనిట్లకు ఒక మిలియన్ యూనిట్ అవుతుంది. ఒక మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తికి 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు.
జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో మే 30న ఉత్పత్తి ప్రారంభించి సెప్టెంబర్ 7వ నాటికే 613 మి.యూ. ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి అతి త్వరగా లక్ష్యాన్ని చేరుకున్నాం. ముందస్తు వరదలు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. – శ్రీధర్, ఎస్‌ఈ, జెన్‌కో, జూరాల
●
675 టీఎంసీలు నదిలోకి..
ఎత్తిపోతల పథకాల కోసం
17.2 టీఎంసీలు విడుదల
సెప్టెంబర్ మొదటి వారంలోనే
విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి
వానాకాలంలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి 17.2 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించుకుని మిగతా 675 టీఎంసీల నీటిని నదిలోకి వదిలేశారు. ఇందులో నెట్టెంపాడు ప్రాజెక్టుకు (4.3 టీఎంసీలు), భీమా–1 (2.6 టీఎంసీలు), భీమా–2, (2.9 టీఎంసీలు) కోయిల్‌సాగర్‌కు (1.9 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతలకు (4 టీఎంసీలు), జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు (1.50 టీఎంసీలు) ఎత్తిపోయగా.. మిగిలిన 659టీఎంసీలను నదిలోకి వదిలేశారు.

918 టీఎంసీలు

918 టీఎంసీలు

918 టీఎంసీలు

918 టీఎంసీలు

918 టీఎంసీలు

918 టీఎంసీలు