
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
నారాయణపేట/నారాయణపేట క్రైం/కోస్గి రూరల్/మద్దూరు: ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెంచాలని వైద్యులకు, అసుపత్రికి సిబ్బందికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం కోస్గి, మద్దూరు సీహెచ్‌సీలను తనిఖీ చేశారు. కోస్గి ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన సదుపాయాల నివేదికను అందించాలని డీసీహెచ్‌ఎస్ మళ్లికార్జున్ అదేశించారు. మద్దూరులో ఎక్స్‌రే సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, మంజూరైన రూ.30 లక్షల జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని అదేశించారు. అసుపత్రి ప్రహారి నిర్మాణం కోసం కడా నుంచి మంజూరైన రూ.25లక్షల పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని అదేశించారు. అంతకుముందు అసుపత్రిలోని చిన్నపిల్లవ వార్డు, జనరల్ వార్డును పరిశీలించి అక్కడి రోగులతో మాట్లాడారు. అందుతును వైద్య సేవలను రోగులను అగిడి తెలుసుకున్నారు. ఔట్‌పేషెంట్, ఇన్ పెషెంట్ల వివరాలను అడిగి తెలసుకున్నారు. ఆర్‌ఎంఓ పావని, తహసీల్దార్ మహేష్‌గౌడ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మల్లీకార్జున్, తదితరులున్నారు.
అటవీ భూములను సంరక్షించాలి
అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టర్ చాంబర్‌లో అటవీ శాఖపై సమీక్షించారు. జిల్లాలో అటవీ భూములు లింగంపల్లి, చిన్న జట్రం, బోయిన్‌పల్లి, కోటకొండ, అమ్మిరెడ్డిపల్లి, తిరుమలపూర్, అభంగాపూర్, ఎక్లాస్పూర్, బైరంకొండ, ధన్వాడ మండలంలోని కొండాపూర్ కిష్టాపూర్ , గోటూర్, మద్దూరు పల్లెర్ల తదితర గ్రామాలలో ఉన్నాయని, పీఓబీ భూభారతి కింద కొన్ని సరిపోలడం లేదని అధికారులు తెలిపారు. అసైన్మెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్‌ను తహసీల్దార్‌లు సర్వే నెంబర్ ద్వారా రికార్డులు పరిశీలించాలని, వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
● దసరాలోగా హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్‌ను సందర్శించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీజీఎంఎస్ ఐడీసీ ఈఈ రతన్‌కుమార్, టెస్కో ఓఎస్‌డి శ్రీలత, డి. బాబు పాల్గొన్నారు.
● ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టులు, స్కూల్ భవనాలు, వసతి గృహాలు, త్రాగునీటి సరఫరా పైప్‌లైన్ల్‌కు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వరద నష్టంపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.