
ఆనందగా ఉంది
చదువుకున్న కళాశాలలో పనిచేస్తున్న సమయంలోనే రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడి అవార్డు రావడం ఆనందంగా ఉంది. జూనియర్ లెక్చరర్‌గా దివంగత వైఎస్సార్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నా. తిరిగి ఇన్నాళ్లకు డిగ్రీ కళాశాల స్థాయిలో అవార్డు రావడంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. హిందీ విభాగంలో మరింత సేవలు అందించేందుకు అవార్డు స్ఫూర్తిగా నిలవనుంది.
– డా.నర్సింహారావు కల్యాణి, అసోసియేట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాల, జడ్చర్ల
జడ్చర్ల టౌన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ అధ్యాపకులలో పట్టణంలోని డిగ్రీ కళాశాల హిందీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.నర్సింహారావు కల్యాణి ఎంపికయ్యారు. నారాయణపేటకు చెందిన డా.నర్సింహారావు ఇంటర్ వరకు అక్కడే చదవి డిగ్రీ జడ్చర్ల బీఆర్‌ఆర్ కళాశాలలో చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో ఎంఏ, ఎంఫిల్ పట్టాలు పొంది హింది సాహితీవేత్త డా.ప్రభాకర్ నవలల్లో సమకాలిన వాస్తవికత అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందాడు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు 30హింది కథలను రాయగా.. హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పీయూ, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, ఎన్‌టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, హిందీ బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. అలాగే హిందీ, ఉర్దూ బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. జిజ్ఞాసలో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి, హిందీ వీడియో పాఠాలు బోధిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై నందుకు ప్రిన్సిపాల్ సుకన్య నేతృత్వంలోని అధ్యాపకబృందం గురువారం శాలువాతో సత్కరించి అభినందించారు.
నర్సింహారావుకు ఉత్తమ అవార్డు