
విద్యుదాఘాతంతో మహిళ మృతి
నవాబుపేట: పంట పొలానికి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ప్రమాదవశాత్తు తగిలి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన కంచె కిష్టమ్మ(40) రెండు రోజులుగా ఇంటి నుంచి అదృశ్యమైంది. గురువారం ఉదయం గ్రామ సమీపంలో కుమ్మరి రాములు వ్యవసాయ పొలంలో మొక్కజొన పంటకు వేసిన విద్యుత్ కంచె వల్ల షాక్‌కు గురై అక్కకక్కడే మృతి చెందింది. చుట్టు పక్కల వారు గమనించి ఆమె కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఆమె కుమారుడు నరేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలోవ్యక్తి మృతి
జడ్చర్ల: పట్టణంలోని 44వ నంబర్ జాతీయ రహదారి ఫ్‌లై ఓవర్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న కంటెయిర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాల పాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి కర్నూల్ వైపునకు వెళ్తున్న కంటెయినర్‌ను బ్రిడ్జిపై వెనుక నుంచి అతి వేగంగా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న రోహిత్ (30) అక్కడికక్కడే మృత్యువాత పడగా.. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారందరూ హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

విద్యుదాఘాతంతో మహిళ మృతి