
ఫిర్యాదులు పరిశీలించిన జిల్లా రిజిస్ట్రార్
మెట్టుగడ్డ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో ఫిర్యాదులను బుధవారం జిల్లా రిజిస్ట్రార్ డి.ఫణిందర్ పరిశీలించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదుల పెట్టెను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత మే నెలలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం ఫిర్యాదులు, సలహాలు ఇచ్చేందుకు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదులను పరిశీలించి, ప్రజల నుంచి వచ్చిన వినతులను చదివి కార్యాలయ సబ్ రిజిస్ట్రార్‌లను, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ప్రజల సౌకర్యార్థం కుర్చీలు బాత్‌రూంలను, ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అసౌకర్యం కలిగి నా, సిబ్బంది ఇబ్బందులు పెట్టినా, ఈ ఫిర్యాదు పెట్టెలో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.