
నేటి నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్–13 బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. పట్టణంలో రెండోసారి మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ (ఎండీబీఏ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆరు కోర్టుల్లో మ్యాచ్‌ల నిర్వహణ
రాష్ట్రస్థాయి అండర్–13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలోని నాలుగు సింథటిక్ కోర్టుల్లో మ్యాచులు జరగనున్నాయి. గురువారం క్యాలిఫైయింగ్ రౌండ్, 5 నుంచి 7 వరకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మెయిన్‌డ్రా పోటీలు జరుగుతాయి. పోటీలో ఉమ్మడి జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు, 11 మంది అఫీషియల్స్ పాల్గొంటున్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. స్టేడియంలో ఏర్పాట్లను మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకుడు సుధాకర్, టెక్నికల్ అషీషియన్ జి.కిషోర్, రెఫరీలు తదితరులు పాల్గొన్నారు.
4రోజుల పాటు పాలమూరులోని
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో
నిర్వహణ
మొదటగా క్యాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు
5 నుంచి మెయిన్ డ్రా పోటీలు
ఏర్పాట్లు చేసిన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్