
12.13 ఎకరాలకు నష్టపరిహారం చెల్లింపు
తమ భూములను ప్రాజెక్టుకు ఇస్తామని ముందుకు వచ్చిన రైతులకు కన్సర్డ్ అవార్డు పేరిట ఎకరానికి రూ.14 లక్షల చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 12.13 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఆర్డీఓ, భూసేకరణ అధికారి రాంచందర్‌నాయక్ చెక్కులు అందజేశారు. ముక్తల్ మండలంలోని టేకులపల్లి ఆరుగురు రైతులకు చెందిన 2.19 ఎకరాలకు సంబంధించి రూ.32.49లక్షలు, మంతోన్‌గోడ్‌లో 27 మంది రైతులకు చెందిన 8.15 ఎకరాలకు సంబంధించి రూ.1.22కోట్లు, ఊట్కూర్ మండలంలోని తిప్రాస్‌పల్లిలో ఆరుగురు రైతులకు చెందిన 1.27 ఎకరాలకు రూ.23.45లక్షల భూ నష్టపరిహారం చెల్లించారు.