
ప్రైవేటులో కొంటున్నాం..
జబ్బు బారినపడే పశువులను వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే మందుల చీటి రాసి బయట తీసుకురామని అంటున్నారు. ఇదేమని అడిగితే తమ వద్ద మందులు అందుబాటులో లేవని చెబుతుండటంతో ప్రైవేటులో కొంటున్నాం. వర్షాకాలంలో పశువులకు అనేక వ్యాధులు సోకుతున్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని పశువైద్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచాలి.
– మోహన్‌రెడ్డి, రైతు, మరికల్
ప్రతిపాదనలు పంపించాం..
అన్నిరకాల మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రెండేళ్ల నుంచి సరిపడా మందులు లేవనే విషయాన్ని ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధశాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి హామీ మేరకు వారం రోజుల్లో జిల్లాకు అన్నిరకాల మందులు వచ్చే అవకాశం ఉంది. పశువులు, ఇతర జీవాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.
– ఈశ్వర్‌రెడ్డి,
జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి
●