
రాజన్న సేవలు మరవలేనివి
మక్తల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి రాష్టంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ప్రారంభించిన పథకాలు నేటికీ పేదలకు అందుతున్నాయని, అంతటి దార్శనికత ఉన్న నేత అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇల్లు, పావలా వడ్డీకి రుణాల మాట విన్నప్పుడల్లా వైఎస్సార్ గుర్తుకు వస్తాడన్నారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటే్‌ష్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, ఎండీ సలాం, రజిత్‌కుమార్‌రెడ్డి, గొల్లపల్లి నారాయణ, కట్ట సురేష్, రవికుమార్, గోవర్ధన్, రవి, నాగేందర్, మందుల నరేందర్, శ్రీనివాసులు, అశోక్‌గౌడ్, వెంకటేష్, రవికుమార్,, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి