
కొత్త ఆయకట్టు కలేనా..?
డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి గ్రహణం
మరికల్: 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కోయిల్‌సాగర్ ఎత్తిపోతల కింద ఆ మేరకు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం కావడం లేదు. ప్రధాన కాల్వలు అయితే తవ్వారు కానీ పొలాలకు వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం చేపట్టపోవడంతో రైతులు ప్రధాన కాల్వల్లో మోటార్లు బిగించి పత్తి, కంది పంటలు సాగు చేస్తున్నారు. పిల్ల కాల్వల నిర్మాణం కోసం భూ సేకరణ చేసినా నిధులు కొరతతో పూర్తి చేయలేకపోయారు. దీంతో కొత్త ఆయకట్టుకు సాగునీరు కలగానే మిగిలింది. జూరాల నుంచి రోజుకు 315 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 23 అడుగులకు నీరు చేరింది. మరో 11 అడుగులు చేరితే పూర్తి స్థాయిలో నిండుతుంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులు నారుమళ్లు సిద్ధం చేశారు. అధికారులు సకాలంలో సాగునీరు విడుదల చేస్తే నాట్లు వేసుకునే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
నిధుల కొరతతో నెరవేరని లక్ష్యం
కోయిల్‌సాగర్ ఆయకట్టు పెంపు ఊసెత్తని అధికారులు, పాలకులు
23 అడుగులకు చేరిన నీటిమట్టం