
ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు
మద్దూరు: స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఓటరు జాబితాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని కొడంగల్ ఎన్నికల అధికారి, వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బీఎల్వోలను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల బీఎల్వోలకు ఓటరు నమోదు, జాబితాలో సవరణలు తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఫారం 6, 7, 8 గురించి వివరిస్తూ ఏ విధంగా తప్పులను సరి చేసుకోవాలనే విషయాన్ని విషయ నిపుణులు తెలియజేశారు. మద్దూరు, కొత్తపల్లి తహసీల్దా ర్లు మహేష్‌గౌడ్, జయరాములు పాల్గొన్నారు.
ప్రైవేట్ క్లినిక్ సీజ్
నారాయణపేట రూరల్: మండలంలోని కోటకొండలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న ఓ ప్రైవేట్ క్లినిక్‌ను శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హతకు మించి వైద్యం చేయడాన్ని గుర్తించి నిర్వాహకులను హెచ్చరించి రోగులను ఆస్పత్రి నుంచి పంపించి సీజ్ చేశారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన వైద్యుడిని నియమించుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాతే సేవలు కొనసాగించాలని సూచించారు.
వైద్యురాలి తీరుపై అసహనం..
మండలంలోని కోటకొండ పీహెచ్‌సీతో పాటు అమ్మిరెడ్డిపల్లి ఉపకేంద్రాన్ని సందర్శించి ఫ్రైడే డ్రైడే నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో శుభ్రత పాటిస్తూ డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డా. చందన, డా. ప్రతిభ భారతి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించాలని, యూనిఫామ్ తప్పక ధరించాలని సూచించారు. అనంతరం డెంగీ కేసు నమోదైన కుటుంబంతో మాట్లాడి సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఎన్సీడీ కో–ఆర్డినేటర్ విజయ్ కుమార్ ఉన్నారు.
ఎస్‌ఈ ఆకస్మిక తనిఖీ
నారాయణపేట రూరల్: మండలంలోని అప్పక్‌పల్లి 132 కేవీ, 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను శుక్రవారం ఎస్‌ఈ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు త్రీఫేజ్ విద్యుత్ ఏ విధంగా సరఫరా చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిర్ణీత సమయానుసారం సరఫరా జరగాలని ఆదేశించారు. అలాగే కొత్తగా అమరుస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు, 33 కేవీ ట్రికటింగ్ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏడీఈ శ్రీనివాస్, రూరల్ ఏఈ సాయినాథ్రెడ్డి, ఎల్‌ఐజీ రవీంద్రాచారి, దేవణ్ణ, ఏఎల్‌ఎం శ్రీకాంత్ ఉన్నారు.

ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు

ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు