
‘జంగంరెడ్డిపల్లి’ సర్వే పనులు ప్రారంభం
నర్వ: ఆరు గ్రామాల రైతుల చిరకాల వాంచ జంగంరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు సర్వే పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ సర్వేను చేపట్టినట్లు ఇరిగేషన్ ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు. ఆరు గ్రామాల రైతాంగానికి సుమారు 7వేల ఎకరాల నుంచి 10వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరీ సర్వే పనులను పూర్తిచేసి డీపీఆర్ తయారు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్వే పనులను వేగవంతం చేయనున్నామన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పాథర్చేడ్, ఉందేకోడ్, జంగరెడ్డిపల్లి, బుడ్డగానితండా, గాజులయ్యతండా, కన్మనూర్ గ్రామాల రైతుల ఆయకట్టుకు సాగునీరు అందేలా ఈ సర్వే చేపట్టనున్నట్లు వివరించారు. ఇదిలాఉండగా, త్వరగా సర్వే పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్ కోరారు. ఈ సర్వేలో డీఈ ఖాజమైనోద్దీన్, ఏఈ సయ్యద్, నాయకులు జగన్‌మోహన్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.