
నూనె గింజల ఉత్పత్తి పెంచాలి: కలెక్టర్
నారాయణపేట: జిల్లాలో నూనె గింజల ఉత్ప త్తి పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్‌ఎంఈఓ) అమలుపై కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో డిమాండ్ మేరకు నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ మేరకు జిల్లాలో నూనె గింజల సాగును ప్రోత్సహించా లని సంబంధిత అధికారులకు సూచించారు. అయితే మద్దూర్, దామరగిద్ద, మక్తల్ మండలాల్లో రైతు ఉత్పత్తిదారులు సంఘాల (ఎఫ్‌పీఓ) సహకారంతో సుమారు 1500 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రోత్సహిస్తున్నట్లు డీఏఓ తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉత్పాదకత పెంపునకు శిక్షణ కార్యక్రమాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహించనున్నట్లు వివరించారు. అదే విధంగా మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు కోసం ఉద్యానశాఖ సహకారం అవసరమన్నారు. అయిల్ ప్రొడక్షన్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మద్దతు ఇవ్వాలని డీఏఓ విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రతిపాదనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అవసరమైన సహాయాన్ని జిల్లా యంత్రాంగం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎల్‌డీఎం విజయ్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మానందారెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఉన్నారు.
బ్యాంకర్ల పాత్ర కీలకం
నారాయణపేట: రాజీవ్ యువవికాసం పథకం అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ అన్నారు. మంగళవారం నారాయణపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎల్‌డీఎం, డీబీసీడీఓ, డీఎండబ్ల్యూఎంసీ, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువవికాసం పథకం మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల అర్హతను ధ్రువీకరించే డాక్యుమెంటేషన్‌ను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. తాత్కాలికంగా అర్హతగల అభ్య ర్థుల జాబితాను వారంలోగా సిద్ధం చేయాలన్నారు. తదుపరి ప్రక్రియను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించాలని తెలిపారు.
దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగు పరిచేందుకు గాను జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు www.nimsme. gov.in వెబ్‌సైట్ లేదా 99661 71253 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
సోనా క్వింటాల్ రూ.2,158
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్‌యార్డులో మంగళవారం వడ్లు సోనా క్వింటాల్ గరిష్టంగా రూ. 2,158, కనిష్టంగా రూ. 1,355 ధర పలికింది. పెసర క్వింటాల్ రూ. 6,219, హంసధాన్యం గరిష్టంగా రూ. 1,935, కనిష్టంగా రూ. 1,729, అలసందలు రూ. 5,052, తెల్లకందులు రూ. 6,032 ధరలు వచ్చాయి.
జీజీహెచ్‌లోకివెల్‌నెస్ సెంటర్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న వెల్‌నెస్ సెంటర్‌ను త్వరలో జీజీహెచ్ ఆవరణకు తరలించనున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని వివిధ గదులను డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ, సూపరింటెండెంట్ డా.సంపత్‌కుమార్‌తో పాటు సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పరిశీలించారు. చివరకు ఈ ఆస్పత్రి వెనుక భాగంలోని రెండు పెద్ద గదులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఆర్ ఎంఓ జరీనా, ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, రాజసింహు డు, వెంకట్, సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిల్‌గౌడ్ పాల్గొన్నారు.

నూనె గింజల ఉత్పత్తి పెంచాలి: కలెక్టర్