ఇంటర్ పరీక్షల్లో మార్పులపై అవగాహన
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో వచ్చిన మార్పులపై అధ్యాపకులకు గురువారం నంద్యాలలోని ఒక కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్‌నాయక్,ఇంటర్మీడియెట్ బోర్డు వనరుల అధికా రి జయసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సంస్కరణలను విద్యార్థులకు వివరించి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నా రు.లెక్చరర్లు బాలచంద్రుడు, కొండారెడ్డి, రఘునాథ రెడ్డి,సుకుమార్, అజీవలి,మద్దిలేటిస్వామి,హుసేన్‌రెడ్డి, దివాకర్, గోవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో మార్పులపై అవగాహన


