పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగం
కర్నూలు(అర్బన్): పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ అన్నారు. ఉర్దూ అకాడమీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వ హించిన ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన గురువారం హాజరై పోటీ పరీక్షల్లో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వివిధ అంశాలపై పోటీ పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చిన వారమవుతామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఐడీయల్ స్కూల్, యునానీ కళాశాలను సందర్శించారు. అలాగే ఉస్మానియా కళాశాలలో నిర్వహించిన ప్రపంచ అరబిక్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గౌస్ పీర్, హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అలీఖాన్, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.


