ప్రజలను ఏమార్చడంలో చంద్రబాబు దిట్ట
పాణ్యం: అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేసి ప్రజలను ఏమార్చడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆయన తమ్మరాజుపల్లె గ్రామంలో ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమం కోసం ఇప్పటి వరకు చరిత్రలో నిలిచే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారా అని ప్రశ్నించారు. సచివాలయాల పేరు మార్చితే అభివృద్ధి జరిగినట్టా అని నిలదీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో దేశానికి ఆదర్శమైన సచివాలయ వ్యవస్థను తెచ్చి వలంటీర్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారన్నారు. జగన్‌కు మంచి పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాల పేర్లు మార్చిందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను నిర్మిస్తే చంద్రబాబు పీపీపీ అంటూ ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. పేదలకు వైద్య సీట్లు రాకుండా, పేదలకు మెరుగైన వైద్యం అందకుండా వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. పీపీపీకి వ్యతిరేకంగా ప్రతి గడప నుంచి సంతకాలు సేకరించి త్వరలో గవర్నర్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోటి సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందగా పాల్గొనడం విశేషమన్నారు. గడప గడపకు కూటమి ప్రభుత్వ కుట్రలను తీసుకెళ్తున్నామన్నారు. ఒకటిన్నర ఏళ్లలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, పార్టీ నేతలు శేషారెడ్డి, బాలిరెడ్డి, శేషయ్య, ౖవేదవ్యాస్, వెంకటేశ్వర్లు, గగ్గటూరు శ్రీనివాసరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, బాబు, వెల్డింగ్ చాంద్‌బాషా, లక్ష్మీనారాయణ సత్యాలు, ఎల్లగౌడ్, కోఆప్షన్ సభ్యులు జాకీర్‌ఉసేన్, బాబి, స్వామి, లక్ష్మనాయక్ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌కు పేరొస్తుందని
వ్యవస్థల పేర్లు మార్పు
సచివాలయాల పేరు మార్చితే
అభివృద్ధి జరిగినట్టా
కోటి సంతకాలతో వైద్య కళాశాలల
ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి


