కర్షకుడి కన్నీటి వ్యథలు పొలాలు చెబుతున్నాయ్!
ఈ చిత్రాన్ని చూస్తుంటే పొలంలో జనాలు ఏదో వెతుకుతున్నట్లు అనిపిస్తుంది కదా..? పని చేయడానికి వచ్చిన కూలీలు కారు. వజ్రాన్వేషణ అంత కన్నా కాదు. ప్రకృతి పగ బడితే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తే.. ఏ చేదోడు లేక నిర్లిప్తంగా నిలిచి పోయిన రైతు వ్యథకు నిలువెత్తు రూపం ఈ దృశ్యం. ఆత్మకూరు మండలం బాపనంతాపురానికి చెందిన శివ అనే కౌలు రైతు ఆత్మకూరు పట్టణ శివార్లలో ఓ రైతుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని కొంత భాగం మొక్క జొన్న వేయగా మిగిలినది ఉల్లి సాగుచేశాడు. భారీ వర్షాలతో మొక్క జొన్న నీళ్లలో మునిగి పోయింది. ఆశలు పెట్టుకున్న ఉల్లి కన్నీళ్లు పెట్టించింది. వానలకు గడ్డ భూమిలో అనుకున్నంత ఊరక పోవడం , మార్కెట్‌లో ధర అంతంత మాత్రమే ఉండడంతో కూలీల ఖర్చు కూడా రాదని తెలుసుకుని పొలంలోనే వదలేశాడు. దీంతో పొలం పట్టణ సమీపంలో ఉండటంతో పేదలు గుంపులుగా పొలానికి చేరుకుని ఉల్లిని సంచులకు సేకరిస్తూ కనిపించారు. – ఆత్మకూరురూరల్


