● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పాణ్యం: రాష్ట్ర ప్రజలకు కొత్తగా సంక్షేమ పథకాలు ఇవ్వడం కంటే ఉన్న పథకాల్లో కోతలు కోయడమే ఎక్కువ అయ్యిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. భూ పనపాడు గ్రామంలో ‘‘బాబుషూరిటీ.. మోసం గ్యా రెంటీ’’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హమీలు అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల పింఛన్లకు కోత పెట్టి ఆ సొమ్ముతో పింఛన్ పెంచినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఖరీఫ్ ప్రారంభమై నా పొలాలకు ఇంకా సాగునీరు ఇవ్వలేదని, రైతులకు యూరియా కూడా అందడం లేదన్నారు. చంద్రబాబు హామీలు అమలు కాక రాష్ట్రంలో ప్రతి కుటుంబం రూ. లక్షకుపైగానష్టపోయిందన్నారు.అక్కచెల్లెమ్మలకు ఒక్క పైసా అందించలేదన్నారు. కాగా.. గ్రామంలో ప్రతి గడప వద్దకు వెళ్లి చంద్రబాబు మెనిఫెస్టో చూపించగా మహిళలు, వృద్ధులు మోసపోయామని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై మహిళలు తీవ్రంగా మండిపడ్డారు.
దారుణం
భూపనపాడు గ్రామంలో పర్యటిస్తున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డికి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్‌లను చూపించారు. బ్యాగులు చినిగిపోతున్నా యని, చాలా సార్లు కుట్టించినా నిలబడడం లేదని చె ప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల క్రితం ఇచ్చిన బ్యాగులను, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన బ్యా గులను కాటసాని పరిశీలించారు. జెట్పీటీసీ మాజీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి , ఎంపీపీ ఉసేన్‌బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, సర్పంచ్ జనార్దన్, శేషిరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి , వైఎస్సార్‌సీపీ పంచాయతీ విభాగం జిల్లా అధ్యక్షులు రామలక్ష్మయ్య, మాజీ సర్పంచ్ క్రిష్ణమోహన్, సుధీర్, శివ, వెంకటేశ్వర్లు, రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
‘సంక్షేమం’ కంటే కోతలే అధికం