ఆర్‌యూలో అనధికార ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌యూలో అనధికార ఉద్యోగులు

Jun 23 2025 6:51 AM | Updated on Jun 23 2025 6:51 AM

ఆర్‌యూలో అనధికార ఉద్యోగులు

ఆర్‌యూలో అనధికార ఉద్యోగులు

జీతాలు చెల్లించడం లేదు

వర్సిటీలో అనధికారికంగా కొందరు విధులు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. గతంలో నలుగురు డైలీ వేజ్‌ కింద వచ్చి విధులు నిర్వహించే వారు. మధ్యలో మానేసి మళ్లీ వస్తున్నారు. వారికి ఎలాంటి జీతం ఇవ్వడం లేదు. ఒక ఎలక్ట్రీషియన్‌ను గతంలో రెండు నెలలు వచ్చి విధు లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే రావొద్దమని చెప్పాం. ఒక నెల రాలేదు. ఈ మధ్యలో వస్తున్నట్లు తెలిసింది. జీతం కోసం ఇటీవల నాదగ్గరికి వచ్చాడు. జీతం చెల్లించలేమని చెప్పాం. – విజయకుమార్‌ నాయుడు,

రిజిస్ట్రార్‌, ఆర్‌యూ

సీఎంఓ చెప్పింది..

ఉద్యోగం చేపిస్తాం

సీఎంఓలో విద్యా వ్యవహారాలు

చూసే ప్రొఫెసర్‌ సిఫారసుతో

ఒకరికి ఉద్యోగం

ఎలాంటి ఉద్యోగ ప్రకటన,

నియామకం లేకుండానే

ఎలక్ట్రీషియన్‌గా విధులు

కీలకమైన పరీక్షల విభాగంలో

ప్రైవేటు కళాశాల ఉద్యోగి

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయంలో అనధికారికంగా కొందరు వ్యక్తులు ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. వీరికి వర్సిటీ ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో రెగ్యులర్‌ వైస్‌ఛాన్సలర్‌గా విధులు నిర్వహించిన ప్రొఫెసర్‌ నలుగురికి డైలీ వేజ్‌ కింద విధులు నిర్వహించేలా ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. దాని ప్రకారం వారు వర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. తరువాత వచ్చిన వీసీ గతంలో వీసీ జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టత లేకపోవడంతో వారిని విధులు నిర్వహించొద్దని ఆదేశించారు. దాంతో వారు కొన్ని రోజులు విధులకు హాజరు కాలేదు. ఇంజినీరింగ్‌ సెక్షన్‌లోని ఓ ఉద్యోగి జోక్యం చేసుకొని వారితో లోపాయికారీ ఒప్పందం చేసుకొని మళ్లీ విధులకు హాజరయ్యేలా వీసీతో మాట్లాడటంతో తిరిగి విధులు నిర్వహిస్తున్నారు. నెలల కొద్దీ విధులు నిర్వహిస్తున్నా వీరికి ఎలాంటి నియామక ప్రకటన, ఉత్తర్వులు లేకపోవడంతో వీరు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు.

● సీఎంఓలో విద్యా వ్యవహారాలు చూసే ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ సిఫారసుతో ఎలాంటి ప్రకటన లేకుండా, ఉన్నత విద్యా మండలి, ఫైనాన్స్‌ అనుమతి లేకుండానే ఆర్‌యూ అధికారులు ఒకరికి ఉద్యోగం కల్పించారు. ఇతను తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన వ్యక్తిగా వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఇతను మూడు నెలలుగా ఎలాంటి నియామక పత్రం లేకుండానే అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదకరమైన ఎలక్ట్రీషియన్‌ పనులు ఇతనితో చేయిస్తున్నారు. విధులకు హాజరు అవుతున్న సదరు ఉద్యోగి జీతం ఇవ్వాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఎవరైనా ఎమైనా అడిగితే సీఎంవో నుంచి ఆదేశాలు ఉన్నాయి.. అవసరం ఉన్నప్పుడు పనిచేయించుకుంటున్నామని వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారని చర్చించుకుంటున్నారు.

● వర్సిటీలో కీలకమైన పరీక్షల విభాగంలో ఆ విభాగం అధికారి తన సొంత నిర్ణయంతో ప్రైవేట్‌ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగితో పనిచేయించుకుంటున్నారని బహిరంగాంగానే చర్చించుకుంటున్నారు. ఇతను కేవలం కళాశాల ప్రిన్సిపాల్‌తో అనుమతి తీసుకొని పరీక్షల విభాగంగా విద్యార్థుల మార్క్స్‌మెమోస్‌, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్స్‌ వెరిఫై చేయిస్తున్నట్లు చెబుతున్నారు. వర్సిటీ ఉన్నతాధికారులకు ఈ సమాచారం తెలియదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి కీలకమైన కాన్ఫిడెన్సియల్‌ అయిన పరీక్షల విభాగంలో అనధికారికంగా ఒక వ్యక్తితో పనిచేయించుకోవడంపై తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

● ఇలా వర్సిటీలో అనధికార ఉద్యోగులు కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వర్సిటీలో ఎంత మంది ఉద్యోగులు అధికారికంగా, ఎంత మంది అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారో అనే సరైన సమాచారం వర్సిటీ ఉన్నతాధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. అధికారంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకే వివిధ కారణాలతో సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కాకుండా వర్సిటీ ఇంటర్నల్‌ ఫండ్స్‌ నుంచి జీతాలు చెల్లిస్తుండటంతో వర్సిటీ ఖజానా మొత్తం ఖాళీ అవుతుందని, వర్సిటీ అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడం ఇబ్బందికరమేని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement