
దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు
బనగానపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ పొందుతున్న దివ్యాంగులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు కొలిమిగుండ్ల, బి ఉప్పలూరు, నాగశెట్టిపల్లి, హనుమంతుగుండం, ఎర్రగుడి గ్రామాలకు చెందిన సుమారు 70 మంది దివ్యాంగులు వచ్చారు. ఉదయం 8 గంటలకు వచ్చినా వైద్యాధికారులు మ ధ్యాహ్నం 12 వరకు అందుబాటులో లేరు. ఆ తర్వాత వచ్చిన వైద్యులు వచ్చినా సర్వర్ పని చేయలేదంటూ సంబంధిత సిబ్బంది సాయంత్రం 5 గంటల వరకు బయోమెట్రిక్ వేయించు కోలేదు. మళ్లీ గురు, శుక్రవారం రావాలంటూ సిబ్బంది పేర్కొనడంతో దివ్యాంగులు తీవ్ర ఆవేదన చెందుతూ వెనుతిరిగి పోయారు.