
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
బొమ్మలసత్రం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజలు అడిషనల్ ఎస్పీకి 67 వినతులను అందించారు. కొన్ని సమస్యలను ఆయన ఫోన్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ జయరాముడు పాల్గొన్నారు.