
పాతూరు తిప్ప కరిగిపోతోంది!
పగిడ్యాల: అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నేతలు సహజ వనరుల లూటీకి తెగబడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా శ్రీశైలం రిజర్వాయర్ మునక భూముల్లోని బింగ గ్రావెల్‌ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నెహ్రూనగర్ పాతూరు తిప్పలో వేల టన్నుల విస్తారమైన బింగ గ్రావెల్ నిక్షిప్తమై ఉంది. ఈ గ్రావెల్‌ను కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నాయకుల కన్ను తిప్పపై పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక ట్రిప్పు బింగ గ్రావెల్‌ను రూ. 1,600 ప్రకారం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుమారు పది ట్రాక్టర్‌లలో రోజుకు 120 ట్రిప్పులకు పైగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గ్రావెల్ దందాపై తహసీల్దార్ శివరాముడును వివరణ కోరగా.. గ్రావెల్ అక్రమ తరలింపును నిలిపివేయాలని ఆదేశించామన్నారు. అయితే గ్రావెల్ కోసం అర్జీ ఇవ్వగా దానిని భూగర్భ, గనుల శాఖ అధికారులకు పంపామని తహసీల్దార్ పేర్కొనడం గమనార్హం.
అధికార పార్టీ నేతల అక్రమ తవ్వకాలు
యథేచ్ఛగా బింగ గ్రావెల్ తరలింపు
రోజూ వందకు పైగా ట్రిప్పులు లూటీ

పాతూరు తిప్ప కరిగిపోతోంది!