
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కిసాన్ డ్రోన్స్ వినియోగంపై గ్రూప్ కన్వీనర్, కో–కన్వీనర్, అధికారులు, ఎఫ్‌పీఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు గ్రూపులకు కూడా డ్రోన్లు పంపిణీ చేశామని, జిల్లాలో ఇప్పటి వరకు 40 డ్రోన్ల వరకు వినియోగించడం జరుగుతోందన్నారు. రాను న్న రోజుల్లో అధునాతన సాంకేతికత డ్రోన్లు రాను న్నాయన్నారు. డ్రోగో కృషి 3ప్రో అనే డ్రోన్ సుమా రు 9.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని అందులో 80 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటిని ఆటోమేటిక్, మాన్యువల్ పద్ధతి ద్వారా వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. నానో యూరియా వినియోగానికి డ్రోన్లను ఉపయోగించుకోవచ్చునన్నారు. రసాయన ఎరువుల విచ్చల విడిగా వినియోగిస్తే భూసారం తగ్గిపోయి దిగు బడులు తగ్గుపోతాయన్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలైన నువ్వులు, బ్లాక్ గ్రామ్, సోయా, కొర్ర తదితర పంటలు వేసేలా రైతులను ప్రోత్సాహించాలన్నారు. అంతకుముందు పలువురు కిసాన్ డ్రోన్స్ సాంకేతిక వినియోగం, ఉపయోగాలు, బ్యాంకు రుణం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు, రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఎల్‌డీఎం రవీందర్ కుమార్, ఆర్‌ఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ రామకృష్ణా రావు, నాబార్డు డీడీఎం, డ్రోన్ నిర్వాహకులు చైతన్య, రైతులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.