
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా విద్యా శాఖాధికారులు ఏక పక్షంగా నిర్ణయాలతో ప్రభుత్వ విద్యారంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి గ్రామంలో 1 నుంచి 5 తరగతులతో ప్రాథమిక పాఠ శాలలను తప్పనిసరిగా కొనసాగించాలి. 1 నుంచి 10 తరగతుల విధానాన్ని ఉపసంహరించు కోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలకు అన్ని రకాల సబ్జెక్టు టీచర్లను నియమించాలి.
– నగరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ జిల్లా సెక్రటరీ, నంద్యాల
అధిక సంఖ్యలో ఉండే ఎస్‌జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి.
–శివయ్య, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల
ఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం

మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి