పరిషత్ ఎన్నికల్లోనూ సత్తాచాటాలి
నల్లగొండ టూటౌన్ : సర్పంచ్‌లుగా గెలుపొందిన బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో పరిషత్ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన కొత్త సర్పంచ్‌లను శుక్రవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించి సన్మానించారు. 834 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన సర్వారం సర్పంచ్ తగుళ్ల శ్రీనయ్యను ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బోనగిరి దేవేందర్, పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, సింగం రామ్మోహన్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, ఎలుక శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


