అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు చేయాలి
గుర్రంపోడు : పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు చేయాలని, ప్రత్యేమైన బ్యాంకు ఖాతా ద్వారా జమ, ఖర్చులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఆదిత్య అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని క్రాంతి ఫంక్షన్ హాల్‌లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిమితికి మించి ఖర్చు చేయాలని, ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా ఖర్చు వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. వివరాలు ఇవ్వకుంటే సర్పంచ్‌లుగా గెలిచినా ఆ తర్వాత అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్, వివిధ గ్రామాల సర్పంచ్, వార్డుల అభ్యర్థులు, అధికారులు పాల్గొన్నారు.


