హిందీ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు
నల్లగొండ: చండూరు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో హిందీ బోధించుటకు పార్టు టైం ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 13 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు సమర్పించాలని, అనంతరం డెమో ద్వారా ఉపాధ్యాయుడిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. సంబంధిత హిందీ సబ్జెక్టులో ఎంఏ, బీఏ, హెచ్‌పీటీ అర్హతతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
మిర్యాలగూడలో
విజిలెన్స్ తనిఖీలు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో 2024–2025, 2025–2026 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నల్లగొండ యూనిట్ అధికారి మనోహర్ తనిఖీలు చేశారు. ముందుగా ఇంజనీరింగ్ విభా గంలోని రికార్డులను ఏఈ నవీన్ ద్వారా తెప్పించుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపట్టిన పనులు, ఖర్చయిన నిధు ల వివరాలు కోరుతూ గతనెల 25న మున్సిపల్ కమిషనర్‌కు మెయిల్ పెట్టినట్టు తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకోవాలి
నార్కట్‌పల్లి : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకునేలా పాఠశాల యాజమాన్యం కృషిచేయాలని ఎంజీ యూనివర్సిటీ కెమిసీ్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.ప్రశాంతి, కామినేని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రామ్మోహన్ అన్నారు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీవిద్యాపీఠ్ స్కూల్‌లో నిర్వహించిన మేథా ఎక్సో ఎగ్జిబిషన్‌ను శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిట్రా సున్మిత తదితరులు పాల్గొన్నారు.
ఆలయ భూములను కాపాడాలి
మర్రిగూడ : మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో గల నీలకంఠ రామస్వామి ఆలయ భూములను కాపాడాలని అదే గ్రామానికి చెందిన కంబాలపల్లి రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండలో దేవాదాయ శాఖ జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూములను సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలని విన్నవించారు. ఆయన వెంట పలువురు గ్రామస్తులు ఉన్నారు.
కనుల పండువగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్ దేవికి ఊంజల్ సేవోత్సవం కనులపండువగా చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ఊంజల్ సేవ జరిపించారు. ఆండాళ్‌దేవికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయ పర్వాలు కొనసాగాయి. సుప్రభాత సేవ, అభిషేకం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
హిందీ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు


