నాడు ఎంపీటీసీ నేడు సర్పంచ్
కేతేపల్లి : గతంలో ఎంపీటీసీలుగా ఎన్నికై న వారు నేడు అదే గ్రామానికి సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామానికి చెందిన కందుల మోహన్ 2013లో ఎంపీటీసీగా పని చేశారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో కాసనగోడు గ్రామం బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో మోహన్ ఇండిపెండెంట్‌గా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థిపై ఆయన 182 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇనుపాముల గ్రామానికి చెందిన బొజ్జ సుందర్ 2019లో ఎంపీటీసీగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇనుపాముల గ్రామం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో బొజ్జ సుందర్ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ప్రత్యర్థిపై 120 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
నాడు ఎంపీటీసీ నేడు సర్పంచ్


