పంచాయతీ పాలనపై.. నెలకోసారి సమీక్ష
ప్రత్యేక సమావేశం
తిరుమలగిరి (తుంగతుర్తి) : పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 46 (1) ప్రకారం నెలకు ఒకసారి గ్రామపంచాయతీ సమావేశాన్ని నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు గ్రామ సభలతో పాటు పంచాయతీ పరిధిలో నాలుగు రకాల సమావేశాలు నిర్వహిస్తారు.
సాధారణ సమావేశం
నెలకు ఒకసారి విధిగా సాధారణ సమావేశాన్ని నిర్వహిస్తారు. సర్పంచ్ అనుమతితో అజెండా నోటీసులను సమావేశానికి మూడు రోజుల ముందుగా వార్డు సభ్యులకు అందిస్తారు. మొత్తం సభ్యుల్లో కనీసం మూడొంతుల మంది సభ్యులు హాజరై గ్రామ అభివృద్ధికి చేయాల్సిన పనుపై తీర్మానాలు చేస్తారు.
అత్యవసర సమావేశం
ఏదైనా విషయం అత్యవసరంగా చర్చించాల్సి వచ్చిన సమయంలో ఒక్కరోజు వ్యవధిలో అజెండా నోటీసులు అందించి సమావేశం నిర్వహిస్తారు. తప్పని సరిగా మూడొంతుల మంది సభ్యులు హాజరు కావాలి. సాధారణ అజెండా అంశాలను ఇందులో చర్చించరు.
అభ్యర్ధన సమావేశం
పంచాయతీ పాలకవర్గ సభ్యుల అభ్యర్ధన మేరకు నిర్వహించే సమావేశం. పాలకవర్గం మొత్తం సభ్యుల్లో మూడో వంతు మంది ఏ తేదీన, ఎందు కోసం సమావేశం కావాలని కోరుతున్నారో తెలుపుతూ 10 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఆ మేరకు సర్పంచ్ సమావేశం నిర్వహిస్తారు.
మూడు రోజుల ముందు సభ్యులకు ఎజెండా నోటీసులు పంపించి సమావేశం నిర్వహిస్తారు. సగం కన్న తక్కువ కాకుండా సభ్యులు హాజరైతేనే తీర్మానాలు ఆమోదిస్తారు. గతంలో ఇచ్చిన తీర్మానాల రద్దు, బడ్జెట్ ఆమోదం, ఉప సర్పంచ్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం వంటి ముఖ్య మైన అంశాలే ఇందులో చర్చించాల్సి ఉంటుంది.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తప్పక నిర్వహించాల్సిందే
అభివృద్ధి, నిధుల వినియోగంపై అనుమతులన్నీ సమావేశాల్లోనే


