ఉపాధి బాట
పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికలు కొన్ని రంగాల వారికి ఉపాధిని కల్పిస్తున్నాయి.
- 8లో
నేడు ‘మూడవ విడత’ ఉపసంహరణ
దేవరకొండ : దేవరకొండ డివిజన్‌లో మూడవ విడతలో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం జరగనుంది. మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటిస్తారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని 9మండలాలకు గాను 269 పంచాయతీలు, 2,206 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ఈనెల 3న ప్రారంభించగా 5న ముగిసింది. 6న నామినేషన్ల పరిశీలన అనంతరం 269 పంచాయతీలకు 1,491, 2,206 వార్డులకు 5,247నామినేషన్లు ఆమోదించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి ఆదివారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు అప్పీళ్లు స్వీకరించారు. డివిజన్ పరిధిలో 7 అప్పీళ్లను స్వీకరించిన అధికారులు సోమవారం వాటిలో 5 అప్పీళ్లను పరిష్కరించారు. మంగళవారం నామినేషన్ల స్వీకరణ పూర్తవుతుంది. ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.


