
‘ఇందిరమ్మ’ బిల్లు మంజూరు చేయాలని ఆందోళన
మర్రిగూడ: ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని మర్రిగూడ మండలం లెంకలపల్లికి చెందిన ఏర్పుల చినమల్లయ్య సోమవారం గ్రామంలో ఆందోళన చేపట్టాడు. గ్రామ పంచాయతీ కార్యదర్శి తన ఇంటి వివరాలను ఫొటో క్యాప్చర్ చేయడం లేదని, తనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు కాకుండా చేశారని, తనకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు చెల్లించాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో బస్సులు, ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్రిగూడ పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవిని వివరణ కోరగా.. ఏర్పుల చిన్నమల్ల య్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని.. కానీ అతడు గతంలోనే స్లాబ్ లెవల్ వరకు ఇంటిని నిర్మించాడని పేర్కొంది. ఇందిరమ్మ ఇల్లు నిబంధనల ప్రకారం నాలుగో లెవల్ వరకు అతడు ఇల్లు నిర్మించాడని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ముందు ముగ్గు, పిల్లర్లు, బేస్‌మెంట్ ఇలా అనేక ప్రక్రియలు ఫొటోలు తీసి ఆన్‌లైన్ చేస్తేనే బిల్లు మంజూరు అవుతుందని ఆమె తెలిపింది.
పురుగు మందు తాగి ఆత్మహత్య
చేసుకుంటానని వ్యక్తి హల్‌చల్