
భూమి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపండి
నా భర్త చిన్న లింగయ్యకు గ్రామంలో 7.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కూలి కోసం ఆంధ్రాలోని మచిలీపట్నం వెళ్లాడు. అక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. నేను ఇక్కడే ఉంటు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నా బాగోగులు పట్టించుకోలేదు. నా తమ్ముడే అన్ని చూసుకుంటున్నాడు. నా భర్త నాకు తెలియకుండా అన్నెపర్తిలో 3 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించాడు. మిగతా భూమిని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ భూమిని వేరే వారి పేర రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేసి నాకు చెందేలా చూడాలి. – అంతటి లింగమ్మ, అన్నెపర్తి, నల్లగొండ మండలం