
కొడుకు అన్నం పెట్టడం లేదు
నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెళ్లిల్లు అయినాయి. ఇద్దరు కొడుకులకు 22 ఎకరాల భూమిని పంచిచ్చాను. నా పేరున 2 ఎకరాల భూమి ఉంది. ఒక కొడుకు చనిపోయాడు. మరో కొడుకు ఊరిలో వ్యవసాయం చేస్తున్నాడు. నాకు ఇటీవల గుండె నొప్పి రావడంతో స్టంట్ వేసిండ్రు. నా కొడుకు నాకు అన్నం పెట్టడం లేదు. హైదరాబాద్లో ఉండే నా పెద్ద కూతురు వద్ద ఉంటున్నాను. ఊరిలోకి వెళ్లి నా పేరున ఉన్న భూమిని అమ్ముకందామన్నా అమ్ముకోనీయడం లేదు. నాకు న్యాయం చేయాలి.
– దేవకమ్మ, నర్సర్లపల్లి, చింతపల్లి మండలం