
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన
నాగార్జునసాగర్ : సాగర్ హిల్‌కాలనీలో నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారి వెంట ఉన్న మహాత్మాజ్యోతీబాపూలే బీసీ గురుకుల విద్యాలయం ఎదుట ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం స్థల పరిశీలన చేశారు. రోడ్డుకు ఇరువైపులా పాఠశాల, హాస్టల్ ఉండడంతో రోజూ మూడుసార్లు 1200 మంది విద్యార్థులు కష్టంగా రోడ్డు దాటుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు.
డిగ్రీ కళాశాలను మార్చాలని వినతి
బీసీ గురుకుల విద్యాలయం ఆవరణలో ఉన్న డిగ్రీ కళాశాలను ఇక్కడి నుంచి మార్చాలని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే ప్రత్యామ్నాయంగా మరో బిల్డింగ్ ఎక్కడ ఉందని ఆడగగా.. సాగర్ ఎర్త్‌డ్యాం దిగువన పాత బీఈడీ కళాశాల భవనం ఉందని చెప్పడంతో.. వర్షంలోనే కలెక్టర్ అక్కడికి వెళ్లి బిల్డింగ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.