
వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ
నకిరేకల్ : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట చంద్రమ్మ గురువారం తన ఇంటి బయట కూర్చోని ఉండగా.. ఇద్దరు యవకులు ఆమె వద్దకు వచ్చి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కోని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బస్సులో సీటు కోసం కొట్లాట
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు. గురువారం ఉదయం 11గంటల సమయంలో స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో కొండ పైన బస్టాండ్‌లోకి బస్సు రావడంతో సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడ్డారు. ఈ సమయంలో మహిళా భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్‌పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది వారిని అడ్డుకొని పంపించారు.