గోమాత.. జాతీయ జెండాలతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయ కొండ చుట్టు ఆదివారం భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీస్వామి వారి జయంతి సందర్భంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం అంటూ గోసేవ ఫౌండేషన్ నిర్వాహకులు గోమాతతో పాటు జాతీయ జెండాలు, కాషాయం జెండాలతో భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. 5వేలకు పైగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మెట్ల దారి మార్గంలో వెళ్లి శ్రీస్వామిని దర్శించుకున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్, ఈవో వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
గోమాత.. జాతీయ జెండాలతో గిరి ప్రదక్షిణ


