
దేశ సైనికులకు మనోధైర్యం కల్పించాలి
మునుగోడు: పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తున్న భారత సైనికులకు దేవుళ్లు మనోధైర్యం కల్పించాలని, భారత్ విజయం సాధించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న కేదారేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు శనివారం మహేష్‌కుమార్‌గౌడ్.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆలయ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో డోలువాయిద్యాలు, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా దేవతలు దీవించాలని కోరుకున్నానని చెప్పారు. గ్రామాల్లో నిర్వహించే దేవాలయ ఉత్సవాల వల్ల ఆ గ్రామ ప్రజలు అందరిలో ఐక్యత పెరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం గ్రామాల్లోని దేవాలయాల అభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్‌నేత తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందర్శన
ఇటీవల అత్యాధునిక హంగులతో మరమ్మతులు చేసినా మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడిని, శాసనమండలి చైర్మన్ గుత్తాను సన్మానించారు.
పీసీసీ అధ్యక్షుడు
మహేష్ కుమార్ గౌడ్